/rtv/media/media_files/2025/11/08/eluru-2025-11-08-10-26-45.jpg)
బండ్ల దొంగతనాల్లో సెంచరీ కొట్టా.. ఎన్నోసార్లు దొరికిపోయా .. జైలుకు వెళ్లా మళ్లీ బయటకు వచ్చా.. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ ఏకంగా పోలీసులకే సవాల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అ వీడియో చూసి అతనితో పాటుగా అతని ముఠాను కూడా అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ వెల్లడించిన వివరాలు ప్రకారం.. నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్లుగా బైక్‌లు చోరీ అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
Thief : Catch me if you can#EluruPolice : Thank you for the evidence! pic.twitter.com/kRByI5XMUQ
— Eluru District Police (@SpEluruDistrict) November 7, 2025
ఈ క్రమంలోనే దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్ ఇటీవల బైక్ చోరీల్లో సెంచరీ చేశానని ఓ వీడియో తీసుకొని తన ఫ్రెండ్స్ కు పంపాడు. అది సోషల్ మీడియా ద్వారా పోలీసులకు చేరింది. దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు ఇటీవల ఐదుగురితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వారిని నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్, గాంధీబొమ్మ కూడలికి చెందిన షేక్ మెహర్‌బాబా, ఎంఆర్ అప్పారావు కాలనీవాసులు షేక్ ఆసిఫుల్లా, చిత్తూరి అజయ్‌కుమార్, గొల్లపల్లికి చెందిన చౌటపల్లి సుభాష్‌గా గుర్తించారు.
12 బైకులు స్వాధీనం
పోలీసులు వారి నుంచి 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన నిందితులు ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులకు సవాలు విసిరిన ముఠాలోని ప్రధాన నిందితుడు దులయ్ గణేష్ ను గుర్తించి.. అతను చేసిన వీడియో రికార్డు ఆయనకే వినిపించారు. అయితే తాను మద్యం మత్తులో అలా మాట్లాడానని, తప్పయిందని తెలిపాడు. మరోసారి పోలీసులకు ఛాలెంజ్ చేస్తావా అంటూ అతడిపై ఎస్పీ ఫైరయ్యారు. గణేష్ ను రిమాండ్‌కు తరలించి, పాత కేసుల్లో కూడా విచారణ జరిపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Follow Us