భాగ్యనగరంలో కుక్కల దాడులు.. భయపడుతున్న జనాలు హైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు అన్ని చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు జనాలపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నేరేడ్‌మెట్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరిపై దాడి చేశాయి. కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. By Shareef Pasha 25 Jun 2023 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ మహానగరంలోని నేరేడ్‌మెట్ పరిధిలోనే.. వెస్ట్ శ్రీ కృష్ణ నగనర్‌లో ఒక చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేయబోయాయి. అయితే.. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. అంతేకాదు వీధి కుక్కలు పలువురిని గాయపరిచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరిగిన ఘటనల వల్ల నగరం మరోసారి ఉలిక్కి పడింది. అయితే పాపకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆమె తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా.. వీధి కుక్కల బెడదతో హైదరాబాద్ ప్రజలు ఇంకా భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు.. వీధి కుక్కల బీభత్సంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. ఇప్పటికైనా.. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అప్రమత్తం కావాలని, వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. ఇక ప్రభుత్వం కూడా ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో ఈ విషయం పై చర్చించారు.. అధికారులు కుక్కలను పట్టుకోవాలి ఆదేశించారు.. మరోవైపు అధికారులు కూడా కుక్కలను పట్టుకుంటున్నారు.. ఇప్పటికే వేల సంఖ్యలో కుక్కలను పట్టుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి