మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!?

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

New Update
మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!?

Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Cricketer Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma) రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాము త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని..మీడియా వాళ్లు దయచేసి ఫోటోలు తీయవద్దని కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిక్వెస్ట్ చేసినట్లు టాక్. నవంబర్‌ 5న విరాట్‌ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను పంచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

publive-image

కాగా కొన్నాళ్ల పాటు కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించుకున్న తర్వాత 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 2021లో ఈ దంపతులు వామిక అనే బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. టీమిండియా విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ ఎంతో కీలకం. గత ఏడాది ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ మళ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు.

publive-image

ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 122 నాటౌట్‌తో అదరగొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాదిపై చెలరేగాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. అటు అనుష్క శర్మ కొంతకాలంగా నటనకు దూరంగా ఉంది. ఆమె తన సమయాన్ని పూర్తిగా వామిక కోసమే కేటాయిస్తోంది. అప్పుడప్పుడు కోహ్లీ ఆడుతున్న స్టేడియాలకు వెళ్లి అతడిని ప్రోత్సహిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు