CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం

AP: ఇవాళ సాయంత్రం సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

CM Chandrababu : ఇవాళ సాయంత్రం సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రాజధాని పరిధిలో భూములిచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు పొడిగించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో వైసీపీ (YCP) కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యి రాష్ట్ర పగ్గాలను దక్కించుకోకపోవడంతో మూడు రాజధానుల అంశం ముగిసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇప్పుడు రాజధాని ఉండనుంది. సీఎం చంద్రబాబు ప్రకటనతో అమరావతిలో భూమి విలువ ఆకాశాన్ని తాకాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలను తాయారు చేస్తున్నారు.

Also Read : రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత పెరిగాయంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు