CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CPI MP Viswam: అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి ఉన్న నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మే 8, 2024న తెలంగాణలోని కరీంనగర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇద్దరు వ్యాపారవేత్తలు ఒక రాజకీయ పార్టీకి 'టెంపో-లోడ్' నల్లధనాన్ని విరాళంగా ఇచ్చారని మీరు చేసిన ఆరోపణలను నిరూపించుకునేందుకు అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది సీపీఐ. ALSO READ: నాకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన కవిత అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను ఎంపీ బినోయ్ విశ్వం ఎత్తిచూపారు. కంపెనీ రక్షణ కోసం బీజేపీ వచ్చిందని అన్నారు. అదానీ అక్రమాలపై చర్చించడానికి ట్రెజరీ బెంచ్ గట్టిగా నిరాకరించడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తును తిరస్కరించడం వల్ల వాష్ అవుట్ అయిన పార్లమెంటు సమావేశాల గురించి కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. తాను అదానీ, అంబానీ అక్రమ సంపద విషయాన్ని లేవనెత్తినప్పుడు బీజేపీ నేతలు అదానీ, అంబానీ వంటి దేశ సంపద సృష్టికర్తలను కించపరిచేలా వ్యాఖ్యలను చేసినట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. ‘‘ప్రభుత్వ అధినేతగా మీరు చివరకు అదానీ, అంబానీల అక్రమాలు, లాబీయింగ్‌లు, నల్లధనం నిల్వలు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలను అంగీకరించడం హర్షణీయం. భారతదేశం, అదానీ, అంబానీల అక్రమాలను క్షుణ్ణంగా విచారించి, వారి నుండి నల్లధనాన్ని వెలికితీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరియు ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులను ఆదేశించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను." అని లేఖలో పేర్కొన్నారు. #modi #adani #cpi-mp-viswam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి