Ayodhya: సమ్మర్లో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..వేడిని తట్టుకునేలా..! దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషులనే కాదు దేవుళ్ల కూడా చుక్కలు చూపిస్తోంది. అయోధ్య రాముడికి కూడా ఎండలను తట్టుకునేలా సరికొత్త దుస్తులను డిజైన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 30 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Cotton Vastra For Ayodhya Ram Lalla: అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో అయోధ్య భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ మధ్యే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అయోధ్యను సందర్శించారు. కాగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల పూర్తవ్వక ముందే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. మేనెలలో ఎలా ఉంటుందోనని జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. ఉదయం 11గంటలు దాటిందంటే బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే హైడ్రేట్ గా ఉండేందుకు పానీయాలు, నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తుంది. ఈ తరుణంలో మనుషులకే కాదు..దేవుళ్లకు కూడా ఎండాకాలంలో చల్లగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. అయోధ్యలోని బాలరాముడికి ఎండల నుంచి తట్టుకునేందుకు కాటన్ దుస్తువులను డిజైన్ చేయించారు. శనివారం బాలరాముడి కాటన్ దుస్తువులనే ధరించారు. వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రామాలయం ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం బాలరాముడికి సహజ నీలిరంగుతో కూడిన మస్లిన్ వస్త్రాన్ని ధరించి, దాని అంచున గోటాతో అలంకరించారు. పవిత్రోత్సవం నుండి ఇప్పటివరకు, రాంలాలా పట్టు వస్త్రాలు ధరించేవారు.వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా, ఇక నుండి రామ్ లల్లా కాటన్ దుస్తులు ధరించాలని ట్రస్ట్ నిర్ణయించింది. Considering the arrival of the summer season and the rising temperatures, starting today, Bhagwan Shri Ramlala will be wearing cotton vastra. The vastra that Prabhu is wearing today, is made of handloom cotton malmal, dyed with natural indigo, and adorned with gotta flowers.… pic.twitter.com/BtDyzQXYgp — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 30, 2024 వాతావరణంలో మార్పుల కారణంగా రామయ్యను వేడి నుండి రక్షించడానికి ట్రస్ట్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వేసవి అంతా స్వామికి ప్రత్యేకమైన వస్త్రాలు తయారు చేయించారు. కాగాభక్తులు భగవంతుని సేవలో తాము చేయగలిగినదంతా చేస్తున్నారు. చలికాలంలో వెచ్చటి బట్టలు, సౌకర్యవంతమైన బట్టలు ధరిస్తారు. కాగా రానున్న శ్రీరామనవమి రామాలయంలో జరుపుకునే మొదటి పవిత్రోత్సవం. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే రామ నవమికి 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో, రామాలయం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 17 వరకు 24 గంటలు తెరిచి ఉంటుంది. పగలు, రాత్రి, హారతిచ భోగ్ సమర్పిస్తారు. భక్తులు రాముని దర్శనం అన్ని సమయాలలో పొందగలుగుతారు. భక్తుల రద్దీ మరింత పెరిగితే ఏప్రిల్ 18న కూడా రామాలయాన్ని 24 గంటల పాటు తెరిచే అవకాశం ఉన్నట్లు ఆలయఅధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: భూకబ్జా కేసులో కామంధుడు, టీఎంసీ నేతషేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ..! #ayodhya #ayodhya-ram-mandir #ram-lalla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి