Corona: జైల్లో ఖైదీకి కరోనా.. ఏపీలో విజృంభిస్తోన్న వైరస్! ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో 90కి పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఓ ఖైదీ కరోనా బారిన పడ్డాడు. కాకినాడ ప్రాంతానికి చెందిన 67 ఏండ్ల వృద్ధుడికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 31 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Corona: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అటు ఏపీలోనూ కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 90కి పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన రాష్ట్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. Also Read: మంచు కురిసే సమయంలో జర్నీ చేస్తున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటిస్తే నో యాక్సిడెంట్స్! తాజాగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాకినాడ ప్రాంతానికి చెందిన 67 ఏండ్ల వృద్ధుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ నెల 17న జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అతడికి జైలు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. 19న జ్వరం ఎక్కువ కావడంతో జీజీహెచ్ (GGH)కు తరలించారు జైలు అధికారులు. ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి ల్యాబ్‌కు పంపారు. Also Read: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్.. చిన్నవయసులోనే ఊహించని మరణం! అక్కడి నుంచి వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైదులు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లాలో 87 సంవత్సరాల వృద్ధుడు ఓపెన్ హార్ట్ సర్జరి జరిగింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొవిడ్ బారిన పడి మరణించిన మొదటి కేసుగా ఏపీ వైద్య రికార్డులో నమోదయ్యింది. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. #andhra-pradesh #carona-jn1-variant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి