Police Uniform : అక్కడ పోలీసుల యూనిఫాం మారింది... ఇక నుంచి ధోతి-కుర్తా! కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. By Bhavana 11 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kashi : కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం(Police Uniform) మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో(Dhoti Kurta) కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుష అధికారులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలను(Salwar Kurta) యూనిఫాంగా వేసుకోనున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు మరికొన్ని చర్యలను కూడా అమలులోనికి తీసుకుని రానున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఆలయంలో రద్దీ నియంత్రిచే సమయంలో ‘నో టచ్’(No Touch) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏ భక్తులను కూడా నేరుగా తాకకుండా తాళ్లతో క్యూలైన్లను కంట్రోల్ చేస్తారు. ఆలయంలో మార్పులు చోటు చేసుకున్న తరువాత భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో వారిని నియంత్రించేందుకు అధికారులు భక్తులను నెట్టివేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా రావడంతో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. Also read: నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు! #kashi #dhoti #kurta #police-uniform మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి