NEET 2024:నీట్ ఫలితాలపై వివాదం..పరీక్షలు మళ్ళీ జరపాలంటున్న తల్లిదండ్రులు

నీట్ 2024 పరీక్షా ఫలితాలు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడమే కాకుండా కొందరు విద్యార్దులకు అదనపు మార్కులు రావడం కూడా అనుమానాలకు తావునిస్తోంది.

New Update
NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా..

NEET 2024 Results: నీట్ 2024 పరీక్షా ఫలితాలు గందరోగోళానికి దారి తీస్తున్నాయి. మొత్తం 24 లక్సల భవితవ్యంతో ముడిపడిన ఉన్న ఈ పరీక్సా ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన నీట్ రిజల్ట్‌లో ఏకంగా 67 మంది ఫ్టస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారి తీస్తోంది. దీనిలో ఎనిమిది మంది ఒకే పరీక్షా కేంద్రం కావడం గమనార్హం. దీంతో పాటూ కొందరు విద్యార్ధులకు అదనపు మాక్ఉలు రావడం లాంటి విషయాలు కూడా కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్‌ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మామూలుగా జూన్ 14వ తీఏదీన నీట్ పరీక్షా ఫలితాలు విడుదల అవ్వాల్సి ఉంది. అలా కాకుండా పదిరోజుల ముందుగానే సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజునే హడావుడిగా రిజల్ట్‌ను అనౌన్స్ చేశారు. దాంతో మార్కుల్లో అవతవకలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీంతో నీట్ పరీక్షా పత్రాం లీక్ అయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని అంటున్నారు. అలాగే నీట్‌ఫ్రాడ్‌, నీట్‌పేపర్‌లీక్‌, నీట్‌స్కామ్‌, నీట్‌రీకండక్ట్‌.. హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్‌ మీడియాలో హోరెత్తుతున్నాయి.

Also Read:Elections :ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి?

ఇక నీట్ పరీక్షా ఫలితాల మీద విపక్షాలు మండిపడుతున్నాయి.ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్‌ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇక పరీక్షా ఫలితాల మీద ఎన్‌టీఏకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మే 5న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్‌ యూజీ-2024 పరీక్షను నిర్వహించింది. 24 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు