Telangana: కాటారం అడవిలో దారుణం.. వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు కానిస్టేబుల్‌ బలి

వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆడె ప్రవీణ్‌ మరణించాడు. ఆదివారం రాత్రి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

New Update
Telangana: కాటారం అడవిలో దారుణం.. వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు కానిస్టేబుల్‌ బలి

Bhupalpalli: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. కూంబింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు.

ఆదివారం రాత్రి కూంబింగ్‌..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 13 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు కాటారం శివారు అటవీలో ఆదివారం రాత్రి కూంబింగ్‌ చేపట్టారు. అయితే రాత్రి 10:15 సమయంలో కాటారం-మహదేవపూర్‌ ప్రధాన రహదారికి 600మీటర్ల దూరంలో వన్య ప్రాణుల వేటకోసం గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు తీగలకు అమర్చారు. అనుకోకుండా ఆ తీగలు తగిలి ఆడె ప్రవీణ్‌(34) అనే కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

ఇది కూడా చదవండి : Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?

తీవ్రగా గాయాలు..
అయితే ప్రవీణ్ చేయి, కాలు, పొట్టభాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే కాటారం సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని అంబులెన్స్‌లో భూపాలపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం రాజోలుగూడకు చెందిన ప్రవీణ్ కు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని భూపాలపల్లి ఓఎస్డీ అశోక్‌కుమార్‌, కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. వేటగాళ్లు అమర్చిన తీగను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు