V. Hanumantha Rao: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కూడా కిడ్నీ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

New Update
V. Hanumantha Rao: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్

V. Hanumantha Rao: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmoor Venkat) పరామర్శించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కూడా కిడ్నీ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది.

రాజ్యసభ రాలేదు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నా.. పార్టీ నమ్ముకుని.. పార్టీ బలోపేతం కోసం పని చేశారు మాజీ పీసీసీ చీఫ్, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతరావు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం మంతనాలు జరిపారు.. కానీ టికెట్ రాలేదు. తరువాత ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన వీహెచ్ కు నిరాశే మిగిలింది. రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో తన గొంతు వినిపించాలని అనుకోని రాజ్యసభ టికెట్ ఆశించారు వీహెచ్.. కానీ ఈ విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. రాజ్యసభ రెండు స్థానాలను సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు కేటాయించింది.

ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే?

ఎంపీ టికెట్ రేసులో..

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి ఉన్నారు. తాజాగా ఈ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చారు. అదెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు. ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తుందనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు