Amit Shah: ఆర్టికల్ 370ని మళ్లీ ప్రవేశపెడతారు... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీజేపీ రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని విమర్శించారు. By V.J Reddy 17 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Home Minister Amit Shah: ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో బహిరంగ ర్యాలీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు దాడికి దిగారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఒక కుటుంబానికి చెందినది కాదు, ఇది రాయ్‌బరేలీ, అమేథీ ప్రజలకు చెందినదని అన్నారు అమిత్ షా. రాయ్‌బరేలీ, అమేథీ ఆ రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని విమర్శించారు. ALSO READ: రిజర్వేషన్లను రద్దు చేయము.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లాలు పీఓకే గురించి మాట్లాడవద్దని, పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మీరు పాకిస్థాన్ కు భయపడవచ్చు కానీ పీఓకే భారతదేశానికి చెందినది.. మేము (బీజేపీ) దానిని వెనక్కి తీసుకుంటాము." అని అన్నారు. #WATCH | Uttar Pradesh: Addressing a public rally in Raebareli, Union Home Minister Amit Shah says, "This (Lok Sabha) seat is not of a family. It belongs to the people of Raebareli and Amethi. Only that person will go to the Parliament, which the people want to send... BJP will… pic.twitter.com/Bk051lZqU2 — ANI (@ANI) May 17, 2024 కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని అన్నారు అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ జైల్లో పెడుతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుంచి గూండాలను తరిమేసే పని చేశారని పేర్కొన్నారు. రాయ్‌బరేలీ మరియు అమేథీలు ఎప్పుడూ గాంధీ కుటుంబాన్ని తమ నాయకులుగా భావించారని.. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం వీరిని ఎప్పుడు తమ ప్రజలుగా గుర్తించలేదని విమర్శించారు. #WATCH | Raebareli, Uttar Pradesh | Union Home Minister Amit Shah says, "They have looted the country... Those who are corrupt will be put behind bars. The development of UP has been done under the leadership of PM Modi... CM Yogi Adityanath has done the work of wiping out goons… pic.twitter.com/veyZ0DqfQn — ANI (@ANI) May 17, 2024 #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి