Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నియామకాలు లోక్‌సభలో కీలక పదవులకు కాంగ్రెస్ నియామకాలు చేపట్టింది. లోక్ సభ ఉపనాయకుడిగా గౌరవ్ గొగొయ్‌ను నియమించింది. చీఫ్ విప్‌గా కె.సురేష్, విప్‌గా మాణిక్యం ఠాగూర్, మరోవిప్‌గా ఎండీ జావైద్ పేర్లను ప్రకటించింది. కొత్తగా పదవులు పొందినవారికి అభినందనలు చెబుతూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. By V.J Reddy 14 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Congress: లోక్‌సభలో కీలక పదవులకు కాంగ్రెస్ నియామకాలు చేపట్టింది. లోక్ సభ ఉపనాయకుడిగా గౌరవ్ గొగొయ్‌ను నియమించింది. చీఫ్ విప్‌గా కె.సురేష్, విప్‌గా మాణిక్యం ఠాగూర్, మరోవిప్‌గా ఎండీ జావైద్ పేర్లను ప్రకటించింది. కొత్తగా పదవులు పొందినవారికి అభినందనలు చెబుతూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తారని అన్నారు. కాగా నిన్న దేశ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా చాటిన సంగతి తెలిసిందే. Hon'ble CPP Chairperson Smt. Sonia Gandhi ji has written to the Hon'ble Lok Sabha Speaker informing him about the appointment of the Deputy Leader, Chief Whip, and two Whips for the Congress Party in the Lok Sabha. Deputy Leader - Shri @GauravGogoiAsm Chief Whip - Shri… — K C Venugopal (@kcvenugopalmp) July 14, 2024 10 స్థానాల్లో కూటమి సునామీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి బిగ్ షాక్ తగిలింది. 13 స్థానాల్లో పది స్థానల్లో ఇండియా కూటమి (INDIA) విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, పంజాబ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్‌లో ఒక్కో స్థానానికి జులై 10 ఉప ఎన్నికలు జరిగాయి. శనివారం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నాలగు స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకే, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు కాంగ్రెస్, ఒకటి బీజేపీ, మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిచాయి. బీహార్‌లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన ఏడు రాష్ట్రాల్లో.. నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉంది. #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి