TS Elections: వీరంతా పార్టీ మారి ఓటమి పాలయ్యారు! గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించి అనంతరం టీఆర్ఎస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిలో సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మినహా మిగతా అందరూ పరాజయం చవిచూశారు. By Naren Kumar 03 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections: పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతా అందరికీ చుక్కెదురైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన - రేగా కాంతారావు (పినపాక), హరిప్రియా నాయక్ (ఇల్లందు), జాజుల సురేందర్ రెడ్డి (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), చిలుమర్తి లింగయ్య (నకిరేకల్), గండ్రవెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి) ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓటమి పాలవ్వడం గమనార్హం. వీరితోపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) కూడా ఈసారి ఓడిపోయారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే డి.సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ పారిన ఈ 12 మందిపై కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఆయా స్థానాలను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకున్న కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. పార్టీ మారిన వ్యక్తులను తిరిగి గెలిపించొద్దని కోరింది. మరోవైపు పార్టీ మారి బీఆర్‌ఎస్‌లో చేరి ఈసారి గులాబీ పార్టీ నుంచి పోటీ చేసినవారిలో సుధీర్ రెడ్డి (ఎల్‌బీనగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) మాత్రమే గెలిచారు. #brs #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి