Rahul Gandhi: రాహుల్ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల రెండో వారంలో ఆయన మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. By Jyoshna Sappogula 05 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల రెండో వారంలో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్ (T Congress) నేతలు సర్వం సిద్దం చేస్తున్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో (Telangana) అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇటీవలె హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం (CWC Meeting), కాంగ్రెస్ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. గత నెలలో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో టీ కాంగ్రెస్ నిర్వహించిన విజయగర్జన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ (Sonia Gandhi) తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ తన ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ ఇలా ఆగ్ర నేతల రాకతో రసవత్తర రాజకీయానికి తెలంగాణ వేదికగా మారింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) అభివృద్ధి పనులతో పాటు ప్రచారంపై కూడా దృష్టిపెట్టింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పక్కాగా వ్యూహలను రచించే పనిలో ఉన్నాయి. Also Read: హైదరాబాద్, చెన్నైల్లో పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ #rahul-gandhi #hyderabad-telangana #rahul-gandhi-telangana-tour #rahul-visit-to-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి