MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే.. VSRపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు ఏపీ ఇన్‌ఛార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్‌.

New Update
MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు!

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎంపీ విజయసాయి రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో (Jubliee Hills Police Station) ఫిర్యాదు చేసింది. టీపీసీసీ (TPCC) అధికార ప్రతినిధి కాల్వ సుజాత (Kalva Sujatha) ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంతకాలం ఉండదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌, వైసీపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయి అని కాల్వ సుజాత పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ఫండింగ్‌ ఇస్తోందని ఆమె ఆరోపణలు చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

విజయసాయి రెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు..

విజయసాయిరెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ, ఏపీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ (Manickam Tagore). సోమవారం రాజ్యసభలో తన గురించి అనవసరంగా మాట్లాడారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల కిందకు వస్తుందని మణికం ఠాగూర్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది భారత ప్రధాన మంత్రి అని గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేయనందుకు ఇప్పటి ప్రధాన మంత్రిని మాత్రం విజయసాయిరెడ్డి ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మణికం ఠాగూర్‌. 2019 నుంచి దాదాపు అన్ని బిల్లులు జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయని అన్నారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు