Murders: ఆ కక్షతో 42 మంది మహిళలను చంపిన 33 ఏళ్ల యువకుడు!

కెన్యాకు చెందిన 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషా అనే వ్యక్తి రెండేళ్లలో 44 మంది మహిళలను చంపిన ఘటన సంచలనం రేపుతోంది. స్త్రీలకు వలవేసి లొంగదీసుకొని తర్వాత చంపి డంప్ యార్డ్ లో వేసినట్లు పోలీసులు గుర్తించారు. మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని కొల్లిన్స్ తన భార్యను కూడా చంపేశాడు.

New Update
Murders: ఆ కక్షతో 42 మంది మహిళలను చంపిన 33 ఏళ్ల యువకుడు!

Kenya: కెన్యాలో జరిగిన ఓ అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరూబీలోని 33 ఏళ్ల యువకుడు రెండేళ్ల నుంచి వరుసగా 44 మంది మహిళలను చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు కొల్లిన్స్‌ జమైసీ కాలుషా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భార్యను చంపి డంపింగ్ యార్డ్ లో..
ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లిన్స్‌ జమైసీ కాలుషా 2022 నుంచి 11 జులై 2024లోపు 42 మంది మహిళలను వలవేసి లొంగదీసుకొని ఆపై హత్య చేశాడు. వారి మృతదేహాలను ఛిద్రం చేసి సమీపంలో భారీ డంపింగ్‌ యార్డ్‌లో పడేసాడు. తాను చంపిన వారిలో తన భార్య కూడా ఉంది. దర్యాప్తులో ఈ హత్యలు చేసినట్లు అంగీకరించాడు. అతడికి మనిషి ప్రాణం అంటే ఏమాత్రం విలువ లేదని చెబుతున్నాడు. మొదట తొమ్మిది మంది మహిళల మృతదేహాలను నైరూబీలోని ముకురూ మురికివాడ చెత్తకుప్పలో ఇటీవల గుర్తించాం. అక్కడినుంచి 100 మీటర్ల దూరంలోనే పాత ఇంట్లో నిందితుడు అద్దెకు ఉంటున్నాడు. ఇంటిని తనిఖీ చేయగా టేపు, నైలాన్‌ సంచులు, రబ్బర్‌ గ్లౌజులు భారీ ఎత్తున్న లభ్యమయ్యాయి.

ఈ ఘోరం ఎలా బయటపడిందంటే..
26 ఏళ్ల జోసఫ్‌ వైనో అనే మహిళ ముకురు ప్రాంతంలో మిస్ అయింది. ఆమె బయటకు వెళ్లడానికి ముందు ఓ ఫోన్‌కాల్‌ వచ్చినట్లు గుర్తించి ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపులో భాగంగా చెత్తలో వెతికింది. దీంతో ఛిద్రమైన మహిళల అవయవాలు బయటపడ్డాయి. వాటికి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. ఆ సంచుల్లో మొత్తం నరికిన శరీర భాగాలు ఉన్నాయి. వాటిపై తూటాల ఆనవాళ్లు లేవు. వారిలో ఒకరిని గొంతు కోసి చంపినట్లు తేలింది. ఇప్పటి వరకు డీఎన్‌ఏ పరీక్షల్లో రెండు మృతదేహాలనే గుర్తించారు. మిగిలినవి తీవ్రంగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘనటతో మరిన్ని కంప్లైట్స్ వస్తున్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment