AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

నెల్లూరు జిల్లా చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు.

New Update
AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. గత రెండు రోజుల క్రితం హాస్టల్ లో కలుషిత నీరు త్రాగడంతో సుమారు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హాస్టల్ కు తరలించి వైద్యుల పర్యవేక్షణ లో ఉంచారు.

Also Read: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్

ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి కలుషితం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. మిగిలిన విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తోటి విద్యార్థులందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తీసుకువచ్చి విద్యార్థులకు అందజేయాలని అధికారులకు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు