Indravelli: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌ శంఖారావం

ముఖ్యమత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పార్టీ తరఫున నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' పేరిట శుక్రవారం బహిరంగ సభ‌ ఏర్పాటు చేసింది.

New Update
Indravelli: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌ శంఖారావం

CM Revanth Reddy: ముఖ్యమత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పార్టీ తరఫున నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' పేరిట శుక్రవారం బహిరంగ సభ‌ ఏర్పాటు చేసింది. అక్కడ ఆదివాసీ అమర వీరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన చేసి బహిరంగసభకు సీఎం హాజరవుతారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కార్యకర్తలకు సీఎం రేవంత్‌ ఈ వేదిక పైనుంచి దిశానిర్దేశం చేయనున్నారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు సభకు తరలివస్తారు.

ఇది కూడా చదవండిఖమ్మం ఎంపీ టికెట్.. కోటి ఆశలతో హనుమంతరావు!

సీఎం రేవంత్‌ ఇంద్రవెల్లిని సెంటిమెంట్‌గా భావిస్తారని సన్నిహితులు చెప్తారు. పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి బహిరంగ సమావేశాన్ని ఆయన ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. 2021లో ఆగస్టు 9న అక్కడ ఏర్పాటు చేసిన దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సభతో పార్టీలో జోష్‌ పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించాల్సిన ఆవశ్యకతను అక్కడ ప్రజలకు వివరించారు. తర్వాత చేపట్టిన కార్యక్రమాలు ఎంతలా సక్సెస్‌ అయ్యాయో తెలిసిందే. ఇక తెలంగాణ పునర్నిర్మాణ సభ కోసం టీపీసీసీ, పూర్వ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ సభను నిర్వహించడంతో దీనికి అమితమైన ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో మరింత జోష్‌ పెంచేలా సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం పీసీసీ చీఫ్‌గా అక్కడ తొలి సభ నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన సీఎం రేవంత్‌, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం హోదాలో మరోసారి ఇంద్రవెల్లిలో శంఖం పూరించబోతున్నారు. తన రాజకీయ కార్యకలాపాలకు ఇంద్రవెల్లి ఎంతగానో కలిసొచ్చిందని రేవంత్‌ భావిస్తారని సన్నిహితులు చెప్తున్నారు. ఇకనుంచి ప్రతి వారం మూడు రోజులు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సీఎం జిల్లాల్లో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు