CM Jagan: 45 రోజులు కష్టపడితే అధికారం మనదే

45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్‌ పనిచేయాలని సీఎం జగన్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారని.. పెద్దగా మార్పులు ఉండవన్నారు.

New Update
Jagan: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan on AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు జగన్ సర్కార్‌ను గద్దె దించాలని టీడీపీ-జనసేన (TDP-Janasena)పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్‌ 'సిద్ధం' (Siddham) అనే పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. బహిరంగ సభల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. విపక్ష పార్టీల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.

Also Read: క్రికెటర్‌ విహారిపై పృథ్వీ రాజ్‌ తండ్రి కంప్లైంట్..!

45 రోజులు కష్టపడాలి

ఈ సమావేశంలో సీఎం జగన్ (CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్‌ పనిచేయాలని సూచనలు చేశారు. 45 రోజులు కష్టపడితే మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనట్లేనని.. కాస్త స్వల్ప మార్పులు ఉంటే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మార్చాల్సినవి ఇప్పటికే 99 శాతం మార్చేశామని అన్నారు. ఇక పెద్దగా మార్పులు ఏమి ఉండవని స్పష్టం చేశారు.

పెద్దగా మార్పులు ఉండవు 

అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలని.. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని కూడా ఐదారుసార్లు కలవాలని అన్నారు. ఇక సోషల్‌ మీడియాలో కూడా పార్టీ క్యాడర్‌ యాక్టివ్‌గా ఉండాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత కొన్నిరోజులుగా వైసీపీ.. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిలను నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంఛార్జి బాధ్యతలు చేపట్టినవారే దాదాపుగా.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సీఎం జగన్‌ తాజాగా చేసిన ఈ ప్రకటనతో స్పష్టమైంది.

Also Read: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు