బీసీలకు అవకాశం రాలేదు, టికెట్ వచ్చిన కాడ గెలిపించండి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! దేశంలో ఎక్కడాలేని విధంగా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దు, 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించాలని కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. By V.J Reddy 07 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR ELECTION TOUR: ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ.. తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం కేసీఆర్(CM KCR). 69 ఏళ్ళ వయసులో కూడా అలసట లేకుండా రోజుకు మూడు జిల్లాల్లో సభలు పెట్టి తెలంగాణ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈరోజు మంథనిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలపై విరుచుకుపడ్డారు. 11 సార్లు అధికారంలోకి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశాన్ని దోచుకుందని ఆరోపించారు. Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్! మంథానిలో కేసీఆర్ మాట్లాడుతూ.. లక్షలు, కోట్లు పెట్టి నేతల్ని కొంటున్నారు వీటిని అదిగమించాలంటే రాజకీయ పరిణితి చెందాలి, నేతలు గెలుస్తారు, ఓడిపోతారు కానీ ప్రజలు గెలిచే వ్యవస్థ రావాలని అన్నారు. ఓటు మీ తల రాత మారుస్తాది, ఆలోచనతో బాధ్యతతో ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేసారు అనేది ముఖ్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణా హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం అని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బందు పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతు బంధు దుబారా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కరెంటు దుబారా అన్న టీపీసీసీ అధ్యక్షుడికి ఓటు వేస్తారా ఎందుకు వెయ్యాలో ఆలోచించండి అని అన్నారు. ధరణి తీసివేస్తే రైతుబంధు ఇస్తారా బంద్ చేస్తారా, ఇస్తే ఏ పద్ధతిన ఇస్తారు అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. దేశంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రము తెలంగాణా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అని అన్నారు. Also Read: ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం? బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదు, టికెట్ వచ్చిన కాడ గెలిపించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాల వైఖరి ప్రజలు గమనించాలి, గెలిచాక నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంథాని నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పుట్ట మధు(Putta Madhu)ను గెలిపించలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక రోజు మంథనిలో ఉండి ప్రత్యేక నిధి వెయ్యి కోట్లు మంజూరు చేసి అన్నీ అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. #cm-kcr #telangana-elections #brs-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి