CM Revanth Reddy : కరెంట్ కట్ చేస్తే ఉద్యోగాలు ఫట్.. సీఎం రేవంత్ వార్నింగ్ విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తున్నారని అన్నారు. By V.J Reddy 22 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Power Cut : రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరా(Power Cut) కు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ, కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. సచివాలయంలో గృహజ్యోతి(Gruha Jyothi), రూ.500కే సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు సీఎం రేవంత్ విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే గత రెండు నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్ కో(TRANSCO) జెన్ కో(GENCO) సీఎండీ రిజ్వీ(CMD Rizvi) సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు. దానికి కారణాలు ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరి చూసుకుంటూ ఉండాలని, అలా చూసుకోకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలియజేశారు. Also Read : గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్! #cm-revanth-reddy #power-cuts #cm-warns #electricity-officers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి