CM Revanth Reddy: వారికి గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ TG: గౌడన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కల్లు గీత కార్మికుల భద్రత కోసం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను సిద్ధం చేసింది. ఈ కవచాలను రేవంత్ రెడ్డి ఈ రోజు పంపిణీ చేయనున్నారు. By V.J Reddy 14 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: గౌడన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కల్లు గీత కార్మికుల భద్రత కోసం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాలను సిద్ధం చేసింది. ఈ కవచాలను రేవంత్ రెడ్డి ఈ రోజు పంపిణీ చేయనున్నారు. తాటిచెట్టు ఎక్కే సమయంలో గీత కార్మికులు కింద పడకుండా.. ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను ఈరోజు నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. గౌడల కులదైవమైన కాటమయ్య పేరిట‘కాటమయ్య రక్షణ కవచం’ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేడు సీఎం రేవంత్ చే ప్రారంభం.. లోక్ సభ ఎన్నికల తరువాత వరుస జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గౌడ కార్మికులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు పాల్గొంటారు. ప్రాణాలను కాపాడే కవచం.. తాడిచెట్టు ఎక్కే సమయంలో గౌడ కార్మికులు కొన్ని సార్లు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మోకు తెగడం, జారడం కారణంగా కింద పడి గాయాల పాలు కావడం, కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మంచనికి పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతీ ఏటా రాష్ట్రంలో దాదాపు 500 మందికి పైగా గౌడ కార్మికులు తాడి చెట్టు ఎక్కుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 200 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల నుంచి గౌడ కార్మికులను కాపడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. ప్రత్యేకంగా ఈ కవచాలను రూపొందించింది. #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి