CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన షురూ TG: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు రేవంత్ వెళ్లనున్నారు. By V.J Reddy 18 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు రేవంత్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. ALSO READ: జగన్‌పై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు వెళ్లనున్నారు.. అనంతరం సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో చామల కిరణకుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు. 22న ఉదయం ఆదిలాబాద్ సభలో పాల్గొంటారు. 23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభలో లోక్ సభ ఎన్నికలపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇంకా క్లారిటీ రాని మూడు స్థానాలు.. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలంగాణలో 14 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటంచిన కాంగ్రెస్ అధిష్టానం.. మూడు స్థానాల్లో మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే బీజేపీ. బీఆర్ఎస్ పార్టీలు అన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. పార్టీ నేతలతో సమావేశాలు, ప్రచారాలతో ఆ రెండు పార్టీలు దూసుకుపోతున్నాయి. కాగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించే విషయంలోనే అయోమయంలోనే ఉంది. ఆ మూడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఎవరిని ప్రకటిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ టికెట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో భట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, సీనియర్ నేత హనుమంతరావు, అలాగే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఐ కూడా ఉండడమే. మరి వీరిలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి. #cm-revanth-reddy #lok-sabha-elections #congress-mp-candidates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి