CM Revanth Reddy: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే!

TG: సీఎం రేవంత్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలని, విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని, తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని వంటి డిమాండ్స్‌ను రేవంత్ చంద్రబాబు ముందు ఉంచనున్నారు.

New Update
CM Revanth Reddy: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే!

CM Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు (AP CM Chandrababu), రేవంత్‌ రెడ్డి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజా భవన్ లో సమావేశం కానున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా, లేఖల ద్వారా సీఎం రేవంత్ కు వివరించారు.

ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి..

● ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగివ్వాలి.
● ఏపీలోని 1000 కి.మీ. మేర తీరప్రాంతంలో తెలంగాణకూ భాగం కావాలి.
● తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం.
● కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు.
● తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ విద్యుత్తు సంస్థలు బకాయి ఉన్న రూ.24 వేల కోట్లను సత్వరమే చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం.
● తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి.

చంద్రబాబు డిమాండ్లు..

* హైదరాబాద్‌లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలి
* విద్యుత్ బకాయిలు రూ. 7,200 కోట్లు చెల్లించాలి
* జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలి
* విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్నీ పంచాలి
* వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

Also Read: మేయర్ రాజీనామా చేయాలి.. GHMC సమావేశంలో రసాభాస

Advertisment
Advertisment
తాజా కథనాలు