CM Revanth Reddy: అమిత్ షా ముందు సీఎం రేవంత్ పెట్టిన డిమాండ్లు ఇవే TG: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రావాల్సిన నిధులపై మోదీతో చర్చించారు. అలాగే అమిత్ షా ముందు పలు డిమాండ్లను పెట్టారు. By V.J Reddy 05 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణకు రావాల్సిన వాటాపై వారి తో చర్చించారు సీఎం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచేందుకు మరికొంత మంది ఐపీఎస్ లను కేటాయించాలని అమిత్ షా ను సీఎం రేవంత్ కోరారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. అలాగే మరికొన్ని డిమాండ్లను సీఎం రేవంత్ అమిత్ షా ముందు ఉంచారు. సీఎం రేవంత్ డిమాండ్లు.. * తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని ఆరికట్టేందుకు ఆదిలాబాద్ మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భద్రతా దళాల క్యాంపులను ఏర్పాటు చేయాలి. * వామపక్ష తీవ్రవాదం అణచివేత కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామ పరిదిలో సీఆర్పీఎఫ్ జేబీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. * మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసు అనే చేర్చుకోవాలన్న నిబంధనను సవరించి 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి అనుమతించాలి. * ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న 60% కేంద్రం వాటా కింద రూ.18.31 కోట్లను వెంటనే విడుదల చేయాలి. * ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి. షెడ్యూ ల్-9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్-10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేయాలి. విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తా వించని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి. #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి