CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం నియమించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరపున జిష్ణుదేవ్ వర్మను స్వాగతిస్తున్నానన్నారు. అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని తెలిపారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

CM Revanth Reddy: onకొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం నియమించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరఫున కొత్త గవర్నర్ గా నియమించబడ్డ జిట్ట ష్ణుదేవ్ వర్మను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది.

నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర మాజీ డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యకి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తాజాగా ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలను అప్పగించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు