/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-4.13.04-PM-jpeg.webp)
CM Revanth at Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. కాంగ్రెస్ నేతలతో పాటు సీపీఐ, ఎంఐఎం నేతలు కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. సీఎం రేవంత్ కి ఘన స్వాగతం పలికారు అక్కడి కాంగ్రెస్ నేతలు. సీఎం రాకతో మేడిగడ్డ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. 21వ పిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని, పగుళ్ళను సీఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మరికాసేపట్లో ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, నిర్మాణంపై ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల ముందు దుమారం:
మేడిగడ్డ బ్యారేజీకి చెందిన కొన్ని పైర్లు కొన్ని నెలల క్రితం మునిగిపోవడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిజనిర్ధారణ బృందాన్ని పంపింది. ఈ ఘటన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. నవంబర్ 2న రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాళేశ్వరం కీలక అంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ పైర్ల పూడికతీతపై న్యాయ విచారణను ప్రకటించింది.
Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5
— Telangana Congress (@INCTelangana) February 13, 2024