Anakapalli: అనకాపల్లిలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ముత్యాలనాయుడు వర్గంపై భగ్గుమంటున్న సీఎం రమేష్ వర్గం..!

అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. అప్పారావుని వైసీపీ వారు ఎందుకు కొట్టారో చెప్పేవరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

New Update
Anakapalli: అనకాపల్లిలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ముత్యాలనాయుడు వర్గంపై భగ్గుమంటున్న సీఎం రమేష్ వర్గం..!

Also Read: ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు.. జగన్ పై రామకృష్ణ విమర్శలు

గత రాత్రి  ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. కే కోటపాడు మండలం చౌడువాడలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్త అప్పారావుపై విచక్షణ రహితంగా దాడి చేశారు.దీంతో బీజేపీ నేతలు వైసీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. అప్పారావుని ఎందుకు కొట్టారో చెప్పేవరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఆయన కూతురు అనురాధను కూడా గ్రామంలోకి రానివ్వమంటున్నారు బీజేపీ నేతలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు