CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్ ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు సీఎం రమేష్. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ లో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీ లో ఎవరు మిగలరని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి CM Ramesh: అనకాపల్లి జిల్లాలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి నాయకులు అంటే చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎంపీ లు, ముఖ్య నాయకులు వైసీపీని విడి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. Also Read: వేసవి వద్దు.. సంక్రాంతి ముద్దు అంటున్న స్టార్స్.. అందరూ అప్పుడే.. వైసీపీలో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీలో ఎవరు మిగలరన్నారు. తెలంగాణ లో ప్రజా వ్యతిరేక విధానాలు చేయబట్టే బీ ఆర్ ఎస్ ను ప్రజలు గద్దె దించారని కామెంట్స్ చేశారు. నాయకులను పార్టీ నుండి బయటకు రావడానికి జగన్ అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. లేదంటే ఎప్పుడో వైసీపీ ఖాళీ అయిపోయేదని వ్యాఖ్యనించారు. వైసీపీ పార్టీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన సర్పంచ్ లకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. Also Read: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ వంద గంటలు కూడా ఉండదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఉరుకోనని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని..జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి జగన్ యువతను మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ ఆయన భజన బృందం జాబులు ఇవ్వకుండా వారి జోబిని నింపుకున్నారని ఫైర్ అయ్యారు. యువతని, రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. తాను గెలిచిన ఆరు నెలలు లోనే ఇబ్బందులలో ఉన్న చెరకు రైతులను అదుకుంటానని హామీ ఇచ్చారు. #cm-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి