CM KCR: మెదక్ లో కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు? అందరిలోనూ ఉత్కంఠ

ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపైన అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి సవాల్ విసరనున్నారనే అంశాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు.

New Update
CM KCR: మెదక్ లో కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు? అందరిలోనూ ఉత్కంఠ

CM KCR Medak Tour: గులాబీ బాస్ రాకతో మెదక్ జిల్లా కేంద్రం అంతా గులాబీమయమైంది. మెదక్ పట్టణ శివారు మంబోజి పల్లి నుంచి కలెక్టరేట్ వరకు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ.. రోడ్డుకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి పార్టీ శ్రేణులు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా కేసీఆర్ (KCR) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.

భారీ బహిరంగ సభ..!

సీఎం పర్యటన సందర్భంగా సీఎస్ఐ గ్రౌండ్స్ లో దాదాపుగా లక్షమందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సమీకృత కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆఫీస్ (SP office) తో పాటు బీఆర్ఎస్ భవన్ (BRS Bhavan) ను కేసీఆర్ ప్రారంభించిన తరువాత నేరుగా ఈ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అక్కడ జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో ఈ భారీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేయడం జరిగింది. జనసమీకరణ కూడా భారీగా ఉండేట్టుగా నేతలు ప్రయత్నలు చేస్తున్నారు. ఇక సీఎం బహిరంగ సభకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని మెదక్ ఎమెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుందన్నారు. సీఎం కారణంగానే జిల్లా కేంద్రం కల నెరవేరుతుందన్నారు. ఇక ఇప్పటి నుంచి అన్నీ శాఖలు ఒకే చోట ఉంటాయన్నారు.

జిల్లాలో భద్రత కట్టుదిట్టం..!

సీఎం పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నర్సాపూర్ నుంచి సీఎం వస్తున్న నేపథ్యంలో ఆ దారిలో ఉన్న అన్నీ షాపులను బంద్ చేయించారు పోలీసులు. మెదక్ జిల్లా పోలీసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. బహిరంగ సభకు వచ్చే వారి వాహనాల కోసం ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.

Also Read: చంద్రయాన్-3 లైవ్ అప్‌డేట్స్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు