ఈనెల 30న ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్

గరిజనులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్‌ చెప్పారు. ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

New Update
ఈనెల 30న ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR of Asifabad district on 30th of this month

పంపిణీకి శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని, పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.

గిరిజనులకు పోడు భూముల పట్టాలు

ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో ప్రభుత్వం ఈ నెల 30వ వాయిదా వేసింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, పర్యటనలో భాగంగా రెండురోజులుగా జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహిస్తున్నది. అదే సందర్భంలో ఈ నెల 29న బక్రీద్ పండుగ కూడా ఉండడం.. వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30కి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆసిఫాబాద్‌ పర్యటన సీఎం కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌, జిల్లా పోలీసుల ప్రధాన కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు