నో డౌట్ వచ్చేది BRS ప్రభుత్వమే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! TS: ఈసారి అధికారంలోకి వచ్చేది BRS ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. By V.J Reddy 05 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR TOUR: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపిక జాబితాపై కసరత్తు చేస్తుంటే.. అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్(KCR) వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది BRS ప్రభుత్వమేనని అందులో ఎలాంటి అనుమాలు లేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధి చేస్తున్న BRS ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ALSO READ: ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ సభలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదిని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు 3 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదు అని.. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది అంటే అది మా ప్రభుత్వం వల్లే అని కేసీఆర్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చామని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాని పనులు తమ ప్రభుత్వం చేసి చూపించిందని హర్షం వ్యక్తం చేశారు. సీతారామా ప్రాజెక్టు 70 శాతం పూర్తయిందని.. వచ్చేది BRS ప్రభుత్వమే కాబట్టి నేనే వచ్చి సీతారామా ప్రాజెక్టు ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలని, అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుందని, ఆ పార్టీ వైఖరి, చరిత్ర చూసి వారిని గెలిపించాలని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ALSO READ: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! #cm-kcr #telangana-elections-2023 #brs-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి