CM KCR: మైనంపల్లి రోహిత్‌ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు!

మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు వేశారు. రోహిత్ ను దిష్టిబొమ్మతో పోల్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు.

New Update
CM KCR: మైనంపల్లి రోహిత్‌ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు!

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజుమెదక్ లో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావుపై సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. మెదక్ లో పద్మ దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి ఎమన్నా పోలిక ఉందా? అని మెదక్ ప్రజలను ప్రశ్నించారు. ఎవర్నో దిష్టిబొమ్మ తెచ్చినట్లు తెచ్చి పద్మాదేవేందర్ రెడ్డి ముందు పెడితే.. మనం ఓడిపోవాలి.. కాంగ్రెస్ వాళ్లు గెలవాలన్న అని అన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని సీఎం కేసీఆర్ మెదక్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దోచోకోడానికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చి తెలంగాణ సొమ్మును దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే.. లేదు రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు.

ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!

తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి బాటలో పోతున్న తెలంగాణకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి పోర్టల్ ను వల్లే రైతు బంధు, రైతు భీమా డబ్బులు పడుతున్నాయని పేర్కొన్నారు. ధరణిని రద్దు చేస్తే ఈ డబ్బులు ఎలా పడుతాయని ప్రశ్నించారు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలకు లొంగి మోసపోవద్దని ప్రజలను కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు