CM KCR Viral Video: డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ అయితే ఏపీ: సత్తుపల్లిలో కేసీఆర్ సెటైర్లు ఏపీ ప్రభుత్వంపై మరో సారి సెటైర్లు విసిరారు సీఎం కేసీఆర్. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ-సింగిల్ రోడ్డు వస్తే ఏపీ అంటూ ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Nikhil 01 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఏపీ ప్రభుత్వంపై (AP Government) మరో సారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్ (CM KCR). ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి గురించి సత్తుపల్లి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మనం ఎవరి నుంచి విడిపోయామో.. వాళ్ల పక్కనే మీరు ఉన్నారన్నారు. 'డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఏపీ' అని మీ అందరికీ తెలుసని తనదైన శైలిలో సెటైర్లు విసిరారు కేసీఆర్. రాష్ట్రం విడిపోతే తాము ఎలా బతుకుతామోనని ఏపీ వాళ్లు గతంలో బాధ పడ్డారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇది కూడా చదవండి: BJP Raghunandan Rao : ప్రభాకర్ రెడ్డిని పొడిచింది అందుకే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రఘునందన్ షాకింగ్ నిజాలు..!! మీకు పరిపాలన చేయడం వస్తదా? బతకడం తెలుసా? అని గతంలో ఏపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. అదే ఏపీ నుంచి ధాన్యం అమ్మడానికి తెలంగాణకు వస్తున్నారన్నారు. కరెంట్ విషయంలోనూ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో చేసిన వాఖ్యలను మరోసారి ప్రస్తావించారు కేసీఆర్. As usual KCR is own way making fun of ap government doesn't have have infrastructure. Shame of YSRCP Govt > 🤡pic.twitter.com/SqHR4vFM96 — 𝗠ᴋ45 •° (@dont_begentle) November 1, 2023 ఇప్పుడు అక్కడ కారు చీకట్లు ఉన్నాయి కానీ.. తెలంగాణలో మాత్రం లైట్ల వెలుగులు ఉన్నాయన్నారు. దీంతో కేసీఆర్ చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీ నేతలు, అభిమానులు కేసీఆర్ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ అంశంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. #viral-video #cm-kcr #ap-cm-jagan #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి