Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం...ఏం వరాలు ఇవ్వబోతున్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు.

New Update
Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం...ఏం వరాలు ఇవ్వబోతున్నారు

CM KCR Public Meeting in Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు. పట్టణంలోని సిరిసిల్ల-సిద్ధిపేట క్యాంప్ ఆఫీస్ బైపాస్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.

ఈ సభకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ (Vemulawada) , నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్లో కేసీఆర్ సిరిసిల్లకు చేరుకుంటారు. బాహ్య రహదారిని ఆనుకుని సభావేదికకు మరోవైపు ప్రత్యేకంగా హెలిప్యాడ్ను నిర్మించారు. అక్కడి నుంచి బస్సులో నేరుగా సభా వేదిక ప్రాంతానికి చేరుకుంటారు. పదేళ్లలో బీఆర్ఎస్‌ (BRS Party) చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్త్‌లో చేపట్టబోయే పనులు ప్రస్తావన ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు.

ఎన్నికల నేపథ్యంలో కార్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధిపై కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని జిల్లా ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు నియోజకవర్గాలకు భారీ బహిరంగ సభ కావడంతో గ్రామాల నుంచి కార్యకర్తల తరలింపుపై సోమవారం ఉదయం సిరిసిల్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ జిల్లా నాయకులకు, నియోజకవర్గ, మండల-స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ సభ గ్రామాల్లో చేపట్టాల్సిన ప్రచారం. అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా సభావేదిక, హెలిప్యాడ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి రానున్నారని గతంలో 2018లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్- కేటీఆర్‌కు అత్యధిక మెజార్టీ రావడంలో తోడ్పాటు అందించాడని మరోసారి జిల్లా కలెక్టరేట్ సముదాయాలు ప్రారంభోత్సవంనకు వచ్చారని, కాగా ఇవ్వాళ భారీ ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ను లక్షపైగా మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి:  బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్

Advertisment
Advertisment
తాజా కథనాలు