YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో "నవరత్నాలు ప్లస్ " విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..! వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీలో "నవరత్నాలు ప్లస్ " పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే.. అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 27 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో "నవరత్నాలు ప్లస్ " పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేశామన్నారు. మేనిఫెస్టో పవిత్రమైన గ్రంథం అన్నారు సీఎం జగన్. 2019 మేనిఫెస్టో అంశాలను 99 శాతం నిష్టతో అమలు చేసినట్లు తెలిపారు. రూ. 2.70 లక్షల కోట్లు లబ్ధిదారులకు వాళ్ల ఖాతాల్లోనే వేసినట్లు తెలిపారు. నేరుగా ఇంటింటికే పథకాలు డోర్ డెలవరీ చేశామన్నారు. Also Read: రణరంగంగా దెందులూరు నియోజకవర్గం.. బూతుల వర్షం కురిపించిన చింతమనేని..! ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా 9 అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళలు, రైతుల కోసం ప్రత్యేక పథకాలు తెస్తున్నారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే నిధులు సాయం మరింత పెంచేలా ప్లాన్ చేశారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై వచ్చే ఐదేళ్లలో ప్రాధాన్యత ఇస్తామనే హామీ ఇచ్చారు. రోడ్లు, పట్టణాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెంచుతామన్నారు. 9 ప్రధాన అంశాలు: 1. మహిళలకు ఉపాధి 2. వ్యవసాయం 3. యువతకు ఉద్యోగం 4. అభివృద్ధి 5. పరిశ్రమలు 6. మౌలిక సదుపాయాలు 7. విద్య 8. వైద్యం 9. ప్రజాపాలన ఇక వివరాల్లోకి వెళ్తే.. అమ్మఒడి పథకం కింద రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా కింద రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ అందిస్తామన్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 విడుతల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష 5 వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. అలాగే అర్హత ఉన్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, నాడు-నేడు , మహిళా సాధికారత, సామాజిక భద్రత, పేదలకు ఇళ్లు లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని సీఎం జగన్ అన్నారు. Also Read: పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.3 వేల నుంచి రూ.3500లకు పెంచుతామని హామీ ఇచ్చారు. 2028,2029 జనవరిలో రెండు విడుతలుగా పెన్షన్ పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు - షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు. రైతులకు ఇచ్చే రైతు భరోసా రూ.13,500 ఉండగా.. ఈసారి మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతూ అయిదేళ్లలో రూ.80 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు అన్ని రకాల లబ్ది కొనసాగుతుందన్నారు. ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందిస్తామన్నారు. వాహన మిత్రను ఐదేళ్ల కాలంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతామన్నారు. లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపజేస్తామని.. అలాగే వీళ్లకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తామన్నారు. అలాగే చేనేతలకు సంవత్సరానికి రూ.24 వేల చొప్పున.. ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ బీమా వర్తింపజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్, వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తూ.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. Also Read: పిఠాపురంలో కోట్ల విలువైన మద్యం సీజ్..! #telugu-news #ycp-manifesto #ap-politics-2024 #ap-elections #lok-sabha-election-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి