CM Jagan : సిద్ధం సభలో చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

ఏపీలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం జగన్. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడని.. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరకీ గుర్తుకురాదని చురకలు అంటించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి చెప్పాలని సవాల్ విసిరారు.

New Update
CM Jagan : సిద్ధం సభలో చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

CM Jagan At Siddham Sabha : మరికొన్ని నెలల్లో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఏపీ(AP) లో విజయకేతనం ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్న సీఎం జగన్(CM Jagan).. సిద్ధం(Siddham) పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తమ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ఈ సభ వేదికగా ఏపీ ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా రాప్తాడు సిద్ధం సభలో పాల్గొన్నారు సీఎం జగన్. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాప్తాడులో జనసముద్రం కనిపిస్తోందని అన్నారు.

ALSO READ : లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్

పేదలకు, పెత్తందారులకు యుద్ధం..

ఏపీలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం జగన్. విశ్వసనీయతకు, వంచనకు యుద్ధం అని పేర్కొన్నారు. పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?.. పక్కరాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?.. చంద్రబాబు(Chandrababu) 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అంటూ ప్రతిపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు పేరు చెబితే..

చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ పథకాలు గుర్తుకురావు అని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచిపని ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్‌ ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడని.. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరకీ గుర్తుకురాదని చురకలు అంటించారు.

ALSO READ : మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు