CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. తీర్పు రిజర్వ్!

AP: ఇటీవల సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ ను ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

New Update
CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. తీర్పు రిజర్వ్!

CM Jagan Attack Case: ఇటీవల సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ ను (Sathish) ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

Also Read: కవితకు బిగ్ షాక్

సతీష్ లు 14 రోజుల రిమాండ్..

ఈ నెల 13న విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌పై (CM Jagan) రాయి దాడి జరిగిన కేసులో నిందితుడు సతీష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితుడు సతీష్ వయసును పరిగణనలోకి జడ్జీ తీసుకోలేదు. కాగా.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.  

రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..

* ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము.
* కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించాయి
* మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశాము
* 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేశాము
* నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్లు గుర్తించాము
* వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడు
* దాడి వెనుక సీఎం ను చంపాలని ఉద్దేశ్యం ఉంది
* అదును చూసి సిఎం జగన్ సున్నితమైన తల భాగంలో దాడి చేశాడు
* 8 గంటల 4 నిమిషాల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో ఉన్నాడు
* దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయి తీసుకొని వచ్చాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు