Chandrababu: అధైర్య పడకండి.. అండగా ఉంటా: ప్రమాద బాధితులకు చంద్రబాబు భరోసా! విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఖర్చుతో సంబంధం లేకుండా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి CM Chandrababu : విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్మించారు. బాధితులతో మాట్లాడిన ఆయన..ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వైద్య సాయంపై డాక్టర్లతో మాట్లాడారు. గాయపడ్డవాళ్ల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. Also Read: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన! ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని.. బాగు చేసే ప్రయత్నంలో తాముంటే ఈ లోపే ఘోర ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఖర్చైన అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. 26 మందికి తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఫార్మా బాధితులకు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించడానికి ఒకటి రెండు రోజులు సమయం ఇవ్వాలని జాహ్నవి కోరారు. చట్టబద్ధంగా వారసులను గుర్తించి రూ. కోటి పరిహారం ప్రభుత్వం తరఫున అందిస్తామని తెలిపారు. కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి