/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cm-1.jpg)
Chandrababu Naidu: విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా, చంద్రబాబు ఆ స్టాళ్లను పరిశీలించి, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.
చేనేత కార్మికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. వాటి ధర రూ. 20 వేలు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రూ.110 కోట్ల మేర చేనేత రుణాలు మాఫీ చేశామని వివరించారు.
On National Handloom Day, I urge everyone to wear traditional handloom at least once a month with pride.
Today, I met with the weavers of Andhra Pradesh and admired the devotion with which they keep the rich tapestry of our heritage alive. Our government is committed to helping… pic.twitter.com/6qLNG3WEvN
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2024
స్థానిక సంస్థల్లో బీసీలకు మళ్లీ 33 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో చట్టం తెచ్చి, పార్లమెంటులో ఆమోదం పొందేలా కృషి చేస్తామని చెప్పారు. పీ-4 విధానం వల్ల సంపద సృష్టి, అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. చేనేత పరిశ్రమపై త్వరలోనే సమగ్ర విధానం తీసుకువస్తామని పేర్కొన్నారు. చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని, లేకపోతే రీయింబర్స్ మెంట్ ద్వారా అయినా చేనేత కార్మికులకు చేయూతనిస్తామని తెలిపారు.
Also Read: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్ కి గుడ్ బై ..వినేశ్ ఎమోషనల్ పోస్ట్!