Telangana Elections: ఇది దొరల..ప్రజల తెలంగాణ మధ్య సంగ్రామం: భట్టి విక్రమార్క

ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలువాలని భట్టి అన్నారు.

New Update
Telangana Elections: ఇది దొరల..ప్రజల తెలంగాణ మధ్య సంగ్రామం: భట్టి విక్రమార్క

దాచుకొని దోచుకునే బీఆర్ఎస్ పాలకుల వల్ల తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని, దీనివల్ల తెలంగాణ సమాజం నష్టపోయిందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ వికాసం జరుగుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదామని భట్టి పిలుపునిచ్చారు. కొట్లాడి, కోరి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు బాగుపడతాయని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు.. కానీ రాష్ట్ర ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణకి అడ్డంగా నిలబడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పాలకులు ప్రజల సంపదను లూటీ చేయడంతో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో..

రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం గెలవాలని స్పష్టంగా చెప్పారని భట్టి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు, ఇండ్లు, ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సార్ధకత వచ్చి ఉండేదని కితబు పలికారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడం, భవిష్యత్‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్నారు. మహిళల కోసం కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని.. అందులో ముఖ్యంగా.. రూ.500లకే సిలిండర్, ప్రతినెల రూ.2,500 వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడం, ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ప్రకటించిందని భట్టి వివరించారు.

పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం, చదువుకునే యువతకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు, పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతామని, ప్రతీ ఇంటికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్‌.. ఈ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పాలకుల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ప్రజల సంపదను దోపిడీ చేశారు కాబట్టే ఇలాంటి పథకాలను అమలు చేయలేకపోయారని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రజల సంపద ప్రజలకే ఖర్చు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ ఉండదని, నిధుల మిగులు ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు తీసుకురావడానికి రాబడిని ఎక్కడి నుంచి తీసుకురావాలో మాకు తెలుసు అని భట్టి తెలిపారు. రైతులకు రుణమాఫీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రకటించిన డిక్లరేషన్స్ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామని భట్టి తెలిపారు.

ఇది కూడా చదవండి: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..?

Advertisment
Advertisment
తాజా కథనాలు