Clothing Tips:అందరిలో ప్రత్యేకంగా కనిపించాలా...అయితే ఇలా రెడీ అయిపోండి

ఎవరైనా సరే అందంగా కనపడాలంటే వాళ్ళ శరీరాకృతికి తగ్గ బట్టలు వేసుకోవాలి. అప్పుడే అందంగా కనపడతారు. లేదంటే ఆ బట్టలు వాళ్ళకి ఏ మాత్రము సెట్ కావు సరి కదా అస్సలు మంచిగా కనపడరు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనబడాలని అనుకుంటారు.ముఖ్యమైన ఫంక్షన్లకి లేదంటే బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టన్నింగ్ లుక్‌లో ఉండాలని తయారవుతూ ఉంటారు. మన అందరి శరీరాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరివి ఒక్కో ఆకారంలో ఉంటాయి. వాటిని బట్టి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అవేంటో మీకు తెలుసా?

New Update
Clothing Tips:అందరిలో ప్రత్యేకంగా కనిపించాలా...అయితే ఇలా రెడీ అయిపోండి

Clothing Tips for Ladies: ఎప్పుడైనా సరే మనం వేసుకునే బట్టలు శరీరాకృతికి తగ్గట్టుగా ఉండాలి. అప్పుడే కాంప్లిమెంట్స్ వస్తాయి. లేదంటే తేడాగా కనిపిస్తాము. ప్రతి ఒక్కరు కూడా వేసుకొనే బట్టలపైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలా మంది వాళ్ల శరీర ఆకృతిని పక్కన పెట్టేసి నచ్చిన బట్టలు ధరిస్తుంటారు. దీని వల్ల వాళ్ళు బాగా అనిపించరు. చూడడానికి అస్సలు బాగోరు కూడా.మన పర్సనాలిటీ ఎలా ఉంది అనేది గ్రహిస్తే బట్టలను ఎంపిక చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఆకారానికి తగ్గ బట్టలు...

ఆపిల్ ఆకారంలో (Apple Body Shape) ఉండే బాడీ... శరీర భాగాలలో పై భాగాలు పెద్దగా వుండి ఎక్కువ వెయిట్‌తో ఉండి.. కింద బాడీ వెయిట్ తక్కువగా ఉన్నట్లయితే అది ఆపిల్ షేప్ బాడీ. ఈ బాడీ ఉన్న వాళ్ల‌కి పెద్ద షోల్డర్స్ ఉంటాయి. అలానే వాళ్ళకు పొట్ట కూడా పెద్దదిగా ఉంటుంది. ఇటువంటి బాడీ టైపు ఉన్న వాళ్ళు ఎక్కువగా కాళ్ల పైన ఫోకస్ పెట్టాలిట. కాళ్ళు షో చేయడం వల్ల కాన్సన్ట్రేషన్‌పై భాగం పై పడకుండా చూసుకోవచ్చు. అలానే ఈ షేప్ బాడీ వాళ్ళు అలైన్ వంటి వాటిని ఎంచుకోవాలి.అలానే దుస్తులు ఎంచుకునేటప్పుడు ప్రింటెడ్ వాటిని ఎంచుకుంటే మంచిది. అలానే త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉన్న వాటిని ఎంచుకుంటే బాగుంటుంది. పలాజో వంటి బట్టలు వేసుకుంటే కూడా మీకు బాగుంటాయి అని చెబుతున్నారు.

రెండవది పియర్ ఆకారం...ఈ ఆకారంలో బాడీ ఉన్న వాళ్ళ కి తొడలు, సీట్ భాగం కొంచెం పెద్దదిగా కనబడుతుంది. పై భాగం మొత్తం అంతా కూడా కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఈ ఫిగర్తో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ బాడీ టైపు ఉన్నట్లయితే సరైన స్టైలింగ్‌లో తయారవ్వొచ్చు. చక్కగా అందంగా మీరు కనబడతారు కూడా. అలైన్, కట్స్ డ్రెస్సులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. క్రాప్ టాప్స్‌ని కూడా మీరు ధరిస్తే బాగుంటారు. అలానే ఈ ఆకారంలో వుండే వాళ్ళు వి నేక్, బోట్ నెక్ కూడా ప్రిఫర్ చెయ్యచ్చు. దానితో ఎంతో అందంగా పియర్ ఆకారంలో బాడీ టైప్ ఉన్న వాళ్ళు కనపడతారు.

Also Read: వీళ్ళు మామూలోళ్ళు కాదు…ఏకంగా ఇంగ్లాండ్ నే ఓడించేశారు.

హావర్ గ్లాస్ ఆకారం లో శరీరం ఉంటుంది మరికొంతమందికి...ఇలాంటి వారు ఆకారానికి తగ్గట్టుగా ఉండే దుస్తులనే ఎంపిక చేసుకోవాలి. స్వీట్ హార్ట్ నెక్, వి నెక్ లు బాగా సూట్ అవుతాయి. అలానే హావర్ గ్లాస్ ఆకారం లో బాడీ టైప్ ఉంటే బెల్ట్ వంటివి ధరిస్తే కూడా బాగుంటుంది. అలైన్ డ్రెస్సులు, కట్స్ ఉన్న బట్టలను ఎంపిక చేసుకో వచ్చు. ఇలాంటివి హవర్ గ్లాస్ బాడీ వాళ్ళకు బాగా సూట్ అవుతాయి.

ఇక రెక్టాంగిల్ షేప్ బాడీ వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే... ఈ ఆకారం ఉన్న వాళ్ళ కి భుజాల నుండి హిప్ వరకు సమానంగా ఉంటుంది. అలానే కాళ్ళు, చేతులే వీళ్ళ బాడీ కి ప్లస్. అలాంటప్పుడు వాటిని అందంగా మార్చుకోవాలి. ఈ భాగాల్లో డ్రెస్సింగ్ ని మెరుగుపరచడం పై దృష్టి పెడితే బెస్ట్. లేయర్డ్, రఫిల్డ్ మరియు A-లైన్ టాప్‌లను ఎంచుకోవాలి. అలానే స్లీవ్‌ లెస్, స్ట్రాప్‌ లెస్, స్వీట్‌ హార్ట్ డ్రెస్సులు బాగుంటాయి. ఇంకా పొడవాటి జాకెట్లు, బ్లేజర్‌ల తో లుక్ ని మరెంత పెంచుకోవచ్చు అంటున్నారు.

ఇన్వర్టెడ్ ట్రై అంగిల్ బాడీ టైప్ ఉంటే అథ్లెటిక్‌గా కనపడతారు. వీళ్ళ భుజాల కంటే హిప్ చాలా ఇరుకుగా ఉంటుంది. కనుక ఈ బాడీ వుండే వాళ్ళు భుజాలు , చేతులను మెరుగుపరచాలి. స్ట్రెయిట్-కట్ జీన్స్ వేసుకుంటే ఫిగర్ బాగా కనపడుతుంది. ఎక్కువగా పెన్సిల్ స్కర్ట్, స్కిన్నీ జీన్స్ లతో చక్కటి టాప్ వేసుకుంటే తిరుగు ఉండదుట. వీ నెక్ వేసుకుంటే చిన్న భుజాలుగా కనపడతాయి. కనుక దాన్ని కూడా ప్రిఫర్ చెయ్యండి అని చెబుతున్నారు.

Also Read: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

చూశారు కదా షేప్ కి తగ్గట్టు మీరు ఎలా తయారు అవ్వాలని.. ఇలా తయారయితే అందంగా కనబడటం మాత్రమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అంటున్నారు. మనల్ని మనం మలుచుకోవడంలోనే అందం ఉంటుందని చెబుతున్నారు. సో మీరు బాడీ టైప్ ఏంటో తెలుసుకోండి....దానికి తగ్గట్టు అందంగా రెడీ అయిపోండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు