Chicken : ఏంటీ ..! చికెన్ కడిగి వండితే ఇలా జరుగుతుందా..! జాగ్రత్త సాధారణంగా చికెన్ శుభ్రంగా కడిగి వండడం అందరికీ అలవాటు. కానీ ఇలా క్లీన్ చేయడం అనారోగ్యానికి దారితీసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు చికెన్ ఎందుకు క్లీన్ చేయకూడదో తెలియాలంటే పూర్తి ఆర్టికల్ చదవండి. By Archana 13 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Chicken: చికెన్ అంతే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంత వారానికి 6 రోజులు చికెన్ లాగించేస్తారు. చికెన్ తో ఎన్నో అదిరిపోయే రెసిపీలు తయారు చేసుకోవచ్చు. అయితే సహజంగా చికెన్ వండే ముందు(Before Cooking Chicken).. ముక్కలను శుభ్రంగా క్లీన్ చేయడం అందరికీ అలవాటు. కానీ ఇలా కడగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణుల. ది కాన్వర్సేషన్"లో ప్రచురితమైన ఒక నివేదిక ఆధారంగా కూడా.. కుక్ చేసే ముందు చికెన్ శుభ్రం చేయకూడదట. చికెన్ శుభ్రం చేస్తే ఏమవుతుంది..? సాధరణంగా చికెన్ లో హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే వంట చేయడానికి ముందు చికెన్ శుభ్రం చేసినప్పటికీ వాటిలోని బ్యాక్టీరియాను తొలగించలేమని చెబుతున్నారు పరిశోధకులు. చికెన్ లో సాల్మొనెల్లా(Salmonella), క్యాంపిలోబాక్టర్ అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా కలిగిన చికెన్ ను చేతులతో శుభ్రం చేయడం వంటి చర్యల వల్ల .. దానిలో బ్యాక్టీరియా పరిసరాల్లో వ్యాపిస్తుంది. పరిసరాల్లో అంటుకున్న బ్యాక్టీరియా ను ముట్టుకున్నప్పుడు కళ్ళు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకని చికెన్ కడగకుండా వండాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇలా చనిపోతాయి మరి చికెన్ శుభ్రం చేయకుండా వండితే ఎలా అని ఆలోచిస్తున్నారా.? ఈ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చికెన్ అధిక వేడి లో కుక్ చేయడం ద్వారా.. సహజంగా దానిలోని క్రిములు చనిపోతాయని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇక్కడ అందరూ ఒక జాగ్రత్త తీసుకోవాలి.. కుక్ చేసే సమయంలో చికెన్ ముట్టుకున్న చేతులు కళ్ళు, ముక్కు పై పెట్టకూడదు. వండిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి . గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే! #chicken #cleaning-chicken #cooking-chicken మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి