Room Cleaning: మంచం తీయకుండా నేలను ఇలా శుభ్రం చేసుకోండి మంచం కింద ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి బెడ్‌ను తీయడం ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని పద్ధతుల్లో సులభంగా మంచం కింద ఉన్న చెత్తను క్లీన్ చేయొచ్చు. వాక్యూమ్ క్లీనర్ గొట్టానికి మరింత పొడవైన పైప్‌ను వేసి మంచం కింద వరకు శుభ్రం చేసుకోవచ్చు. క్లీనింగ్ టేక్నిక్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్ళండి. By Vijaya Nimma 05 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Room Cleaning: ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మంచం కింద ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి బెడ్‌ను తీయడం ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని పద్ధతుల్లో సులభంగా మంచం కింద ఉన్న చెత్తను క్లీన్ చేయొచ్చు. రూమ్ క్లీన్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. చీపురు కట్టిన పొడవాటి కర్ర: మాములుగా చీపురుతో మంచం కింద శుభ్రపరిస్తే చీపురు కొంచెం వరకే మంచం కిందకి వెళ్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక పొడవాటి కర్రకు చీపురు కట్టి ఊడ్చడం వల్ల మంచం మూలల వరకు చీపురు వెళ్తుంది. దీంతో ఎంచక్కా శుభ్రం చేసుకోవచ్చు. వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి: మంచం కింద సులభంగా శుభ్రం చేయడానికి మీరు వాక్యూమ్ క్లీనర్‌ను కూడా ఉపయోగించవచ్చు. వాక్యూమ్ క్లీనర్ గొట్టానికి మరింత పొడవైన పైప్‌ను వేసి మంచం కింద వరకు శుభ్రం చేసుకోవచ్చు. చిన్న చిన్న చెత్తాచెదారం కూడా క్లీన్ అవుతుంది. నేలను ఇలా శుభ్రం చేయండి: మంచం కింద నేలను శుభ్రం చేయడానికి ముందుగా ఒక బకెట్లో వేడి నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా డిటర్జెంట్ వేయాలి. కావాలంటే వెనిగర్ కూడా కలుపుకోవచ్చు. దీంతో నేలను శుభ్రం చేయడం వల్ల దుమ్ముతో పాటు దుర్వాసన కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా నేలను శుభ్రం చేయడానికి పొడవాటి కర్రకు చివర ఒక క్లాత్‌ను కట్టి దాన్ని నీటిలో తడిపి శుభ్రం చేసుకున్నా మురికి పోతుంది. కొన్ని రకాల కెమికల్స్: ప్రస్తుతకాలంలో టైల్స్‌ని క్లీన్ చేయడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నీటిలో కలిపి నేలను క్లీన్ చేయడం వల్ల సులభంగా మురికి వదిలిపోవడంతో పాటు సువాసన కూడా వస్తుంది. ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే మీ ఇంట్లో ఒక్క ఈగ కూడా వాలదు..ఒక సారి ట్రై చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #home-tips #room-cleaning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి