ఈ ఏడాది నుంచే కామన్ సివిల్ కోడ్... సీఎం కీలక వ్యాఖ్యలు...!

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉత్తరాఖండ్‌లో స్థిరపడుతున్నారని చెప్పారు. దీంతో రాష్ట్ర జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. దాన్ని పరిశీలించాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.

author-image
By G Ramu
New Update

దేశంలోని ప్రతి పౌరునికి ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అన్నారు. యూసీసీ కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ యూసీసీ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు.

ఎన్నికల్లో ఒక సారి గెలిచిన పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయం ఉత్తరాఖండ్ లో వుందన్నారు. అలాంటి సంప్రదాయాన్ని పక్కకు పెట్టి భారీ మెజారిటీతో తమకు మళ్లీ అధికారాన్ని కట్టబెట్టామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో యూసీసీ ముసాయిదా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

ఆ కమిటీ ముసాయిదాను రూపొందించే ముందు రాష్ట్రంలోని 2.33 లక్షల మంది ప్రజల, పలు సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించిందన్నారు. గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లో ఉద్భవించాయన్నారు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మికత, విశ్వాసాలతో పవిత్ర భూమిగా ఉందన్నారు. ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమైన లక్షణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు