Toxic Teaser: యష్ 'టాక్సిక్' టీజర్ రిలీజ్.. ధైర్యం ఉంటేనే చూడండి!!

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యష్ “టాక్సిక్” టీజర్ రిచ్ విజువల్స్, భారీ యాక్షన్‌తో ఆకట్టుకుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ఈ మూవీ ధురంధర్ 2 తో పోటీ పడనుంది.

author-image
By Lok Prakash
New Update
Toxic Teaser

Toxic Teaser

Toxic Teaser: భారతీయ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల్లో “టాక్సిక్” ఒకటి. దాదాపు రూ.500 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, కన్నడ చిత్రసీమలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా చిత్రబృందం అన్ని భాషల్లో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ముందుగా వచ్చిన గ్లింప్స్‌తో పోలిస్తే ఈ టీజర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతం, గ్లామర్, మాస్ స్టైల్ అన్నీ కలిపి టీజర్‌ను భారీ స్థాయిలో చూపించారు. అయితే ఈ టీజర్‌లో కథ ఏమిటి అనే విషయం మాత్రం స్పష్టంగా చూపించలేదు.

సినిమా ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసినా, కథలోని అసలు స్టోరీ ఎమోషన్ ఇంకా బయటకు చూపించలేదు. ప్రేక్షకులను ఎమోషన్స్ తో కట్టి పడేసే ఆ కథ ఏంటో మేకర్స్ ఈ టీజర్ లో రివీల్ చేయలేదు. మరో విషయం ఏమిటంటే, సినిమాలో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్లకు టీజర్‌లో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

Also Read: రూటు మార్చిన సుహాస్.. 'మండాడి'తో తొలిసారి ఆ రికార్డ్!

ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టీజర్‌లో సర్కస్ నేపథ్యం కనిపించడం ఆసక్తి కలిగించింది. యష్ పాత్ర ‘ఫియర్‌లెస్ రాయా’గా చాలా రఫ్‌గా, వైల్డ్‌గా కనిపిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ కొత్తగా ఉన్నాయి. టీజర్ చివర్లో యష్ మరో లుక్‌లో కనిపించడం, ద్విపాత్రాభినయం ఉండొచ్చనే అనుమానం కలిగిస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కు పెద్ద ప్లస్ పాయింట్. రవి బాస్రూర్ ఇచ్చిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, కలర్ టోన్ చాలా డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉన్నాయి. మొత్తం మీద టీజర్ చూస్తే ‘A’ సర్టిఫికెట్ వచ్చే స్థాయిలో హింసాత్మకంగా సినిమా ఉండొచ్చని అర్థమవుతోంది.

Also Read: ఏం హారర్ భయ్యా..! ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఈషా' ఎంట్రీ

ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులు నటిస్తున్నారు. యష్ ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా కావడంతో ఇది ఈవెంట్ మూవీగా మారింది. యష్ కూడా కథా రచనలో భాగస్వామి అయ్యారని సమాచారం.

ఇక మరోవైపు “ధురంధర్ 2” వంటి భారీ సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుండడంతో పోటీ గట్టిగానే ఉంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకు మరింత బజ్ అవసరం ఉంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్థాయి ఉన్నప్పటికీ, ప్రమోషనల్ కంటెంట్ ఇంకా ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

మార్చి 19, 2026న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. అంచనాలకు తగ్గ ఫలితం అందిస్తుందా లేదా అన్నది విడుదల త్వరలో తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు