సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా అవుట్.. అంతా ఆ నిర్మాత వల్లే..? వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. 'గేమ్‌ఛేంజర్' సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఆయన నిర్మాణంలోనే వెంకీ, అనిల్ రావిపుడి ప్రాజెక్ట్ వస్తుండటంతో ఈ మూవీని వాయిదా వేయనున్నారట. By Anil Kumar 16 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ పొంగల్ బరి నుంచి తప్పుకుంది. ఇప్పుడు మరో బడా మూవీ సైతం సంక్రాంతికి రావట్లేదనే టాక్ బయటికొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. Also Read : ప్రభాస్ ను కేవలం దానికే వాడుకుంటున్నారు.. కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. #venkyanil3 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. Also Read : నాకు యాక్టింగ్ రాదు, నేనొక చెత్త నటిని.. సమంత షాకింగ్ కామెంట్స్ చిరుతో పాటు వెంకీ కూడా.. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్‌ఛేంజర్ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఆయన నిర్మాణంలోనే వస్తున్న మరో చిత్రం వెంకీ అనిల్ రావిపుడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను మొదట సంక్రాంతికి తీసుకువద్దాం అనుకున్నారు. Also Read : అఖండ ఖాతాలో అరుదైన రికార్డు.. అది బాలయ్యకే సాధ్యమంటున్న అభిమానులు! కానీ అదే టైంలో దిల్ రాజు సోంత ప్రోడక్షన్ నుంచి గేమ్ ఛేంజర్ వస్తుంది. దీంతో వెంకీ అనిల్ రావిపుడి సినిమాను వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది. సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. త్వరలోనే మూవీ టీమ్ నుంచి దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. Also Read : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య.. #hero-venkatesh #anil-ravipudi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి