V.V. Vinayak Adhurs 2: సినిమా రంగంలో ఎంత గొప్ప దర్శకుడైనా ఒక దశ తర్వాత ఫామ్ తగ్గడం సహజం. ఎప్పటికీ టాప్‌లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కూడా చాలా పెద్ద దర్శకులు ఒక సమయంలో మంచి సినిమాలు ఇచ్చినా, తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా మంది దర్శకులు తమ ఫామ్ తగ్గిందని అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంటారు.
అయితే టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ V. V. Vinayak మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన చివరిగా చేసిన హిందీ “ఛత్రపతి” రీమేక్ పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగే సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tejతో చేసిన “ఇంటిలిజెంట్” సినిమా కూడా నిరాశపరిచింది. ఈ పరిస్థితుల్లో ఆయన దర్శకత్వానికి కొంచెం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఒక ఈవెంట్‌లో మాట్లాడిన వినాయక్, దర్శకులు ఎప్పుడు ఆగాలో కూడా తెలుసుకోవాలని అన్నారు. కొత్త ఆలోచనలు లేకపోతే బలవంతంగా సినిమాలు తీయడం కంటే ఆగిపోవడమే మంచిదని చెప్పారు. పాత స్టైల్‌లోనే కథలు తీస్తే ప్రేక్షకులు విసుగు చెందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే హీరోల దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పారు.
ఇక ఆయన కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన అదుర్స్ Adhurs సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాలో జూ ఎన్టీఆర్ Jr NTR, బ్రహ్మానందం Brahmanandam కాంబినేషన్ ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వినోదం అందిస్తోంది.
చాలా కాలంగా రచయిత కోనా వెంకట్ Kona Venkat “అదుర్స్ 2” తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ దీనిపై వినాయక్ క్లియర్‌గా స్పందించారు. “అదుర్స్” కథ అక్కడితో ఎండ్ అయిపోయింది, దానికి సీక్వెల్ తీసేందుకు పెద్దగా అవకాశం లేదని అన్నారు.
అదే కాకుండా, బలవంతంగా సీక్వెల్ తీసినా మొదటి భాగం ఇచ్చిన మజాను మళ్లీ తీసుకురాలేమని చెప్పారు. అందుకే ఆ సినిమాను అలాగే వదిలేయడం మంచిదని స్పష్టం చేశారు. కొన్ని మంచి సినిమాలను సీక్వెల్ పేరుతో పాడు చేయకుండా, మంచి జ్ఞాపకంగా ఉంచడం బెటర్ అని ఆయన అభిప్రాయం.
వినాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కొంతమంది అభిమానులు నిరాశపడినా, చాలా మంది ఆయన నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం Jr NTR ఇతర పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, “అదుర్స్ 2” వచ్చే అవకాశం ఇక లేనట్టుగానే కనిపిస్తోంది.
V.V. Vinayak Adhurs 2: "ఒరేయ్ చారి..! “అదుర్స్ 2” ఇక లేనట్టే రా..!!" వి.వి.వినాయక్ సంచలన వ్యాఖ్యలు..
వి.వి.వినాయక్ తాను ఫామ్ తగ్గిందని అంగీకరిస్తూ, కొత్త ఐడియాలు లేకపోతే సినిమాలు చేయకూడదని చెప్పారు. అదుర్స్ కి సీక్వెల్ అవసరం లేదని, బలవంతంగా తీస్తే మొదటి భాగం మజా రాదని స్పష్టం చేశారు. దీంతో “అదుర్స్ 2” వచ్చే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది.
V.V. Vinayak Adhurs 2