Ustaad Bhagat Singh OTT: షేర్ ఆగయా..! ఓటీటీలోకి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా ముఖ్య హీరోయిన్లుగా నటించారు.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh OTT

Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ చిత్రం విడుదలై నెగటివ్ రివ్యూలు రావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా రూ.100 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ రెండోసారి కలిసి పని చేశారు.

ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. విలన్ పాత్రలో పార్థిబన్ నటించాడు. అలాగే కేఎస్ రవికుమార్, గౌతమి, రావు రమేష్, శ్రీనాథ్ మగంటి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

Advertisment
తాజా కథనాలు